వేద న్యూస్, వరంగల్:

ఇటీవల జరిగిన టీఎన్జీవోస్ యూనియన్ సెంట్రల్ ఫోరం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం అయినందున, సంక్రాంతి పండుగ సందర్భంగా  శుక్రవారం  హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు  జనుగాని అశోక్ ఆధ్వర్యంలో  టీఎన్జీవోస్ యూ నియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌కు  శుభాకాంక్షలు తెలిపారు.

రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో  సన్మానించి.. పూలబొకే అందించి విషెస్ చెప్పారు.  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం హనుమకొండ జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎండీ రఫీ, జాయింట్ సెక్రెటరీ బి.వెంకటేశం, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు జి.వెంకన్న పాల్గొన్నారు.