- ఘనంగా సాంస్కృతికోత్సవ వేడుకలు
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ, పీ.జీ కళాశాలలో బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.రమేష్ అధ్యక్షతన ఘనంగా కళాశాల సాంస్కృతికోత్సవ వేడుకలు జరిగాయి. కళాశాల విద్యాసంవత్సరం 2024-25 ముగింపును పురస్కరించుకొని కళాశాల సాంస్కృతికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదివి తమ లక్ష్యాలను సాధించాలన్నారు.

ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు. శ్రమించినప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతామని వెల్లడించారు. తృతీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు వచ్చే సంవత్సరంలో పీ.జి , బీ.ఈడి వంటి ఉన్నత కోర్సులు చదవాలన్నారు. అలాగే అర్హత ఉన్న ఉద్యోగాల కోసం పోటీపడాలని సూచించారు.

అనంతరం విద్యార్థులు తమ ఆట, పాటలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చేసిన సాంసృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్-ప్రిన్సిపాల్ డా.ఎస్. ఓదెలు కుమార్, డా. రాజేంద్రం, డా. గణేష్, డా.శ్యామల, డా. మాధవి, కిరణ్ కుమార్, ఉమాకిరణ్, రాజకుమార్, మమత, డా. రవి, ఎల్. రవిందర్, శ్రీనివాస్ రెడ్డి, సుష్మ, రవి ప్రకాశ్ రావు, డా. శ్రీనివాష్, కె. శ్రీనివాస్, రమేష్, ప్రశాంత్, సాయికుమార్, శ్రీకాంత్, అరుణ్ రాజ్, అనూష, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తతే మేలు.. ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్