= పాస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డా. సంగని మల్లేశ్వర్
వేద న్యూస్, కేయూ క్యాంపస్:
స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన మహానాయిక, గొప్ప రచయిత్రి సావిత్రిబాయి ఫూలే అని ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ప్రాంగణంలో ఫూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంగని మల్లేశ్వర్ సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజంలో అందరూ చదవాలి, సమానత్వంతో జీవించాలనే లక్ష్యంతో పోరాడిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి ఫూలే అని పేర్కొన్నారు. స్త్రీల విద్యాభివృద్ధికి ఆమె చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి మహిళ విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మెరుగు బాబు యాదవ్, ఆకా రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరాం వీరయ్య, డాక్టర్ వంగాల సుధాకర్, జిల్లా కార్యదర్శి డాక్టర్ ఏ. సంపత్ కుమార్, విజయ్, మంద శ్యాం, గైని రవీందర్ తదితరులు పాల్గొన్నారు.