వేద న్యూస్,బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని, పురస్కరించుకుని బోయినిపల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ పింకల్ యాదవ్ ని ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం,అలాగే పోలీస్ శాఖకి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమాకాంత్, మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాలలో విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. మహిళల, భద్రత మరియు గౌరవాన్ని కాపాడటంలో పోలీస్ శాఖ, ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోయినిపల్లి పోలీస్ , సిబ్బంది, పాల్గొన్నారు.