వేద న్యూస్, వరంగల్:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఓగ్లాపూర్ గ్రామంలోశనివారం పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో మహిళాసభ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా సెక్రెటరీ నరేష్ మాట్లాడుతూ.. అగ్రికల్చర్ నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో వి. ఓ.ప్రెసిడెంట్ సుల్తానా,ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల శంకర్, వి. ఓ.ఏ.సుజాత, కారోబార్ శ్రీనివాస్,అంగన్వాడీ టీచర్ లక్ష్మి బాయి,ఆశావర్కర్ రజిత,గ్రామ పంచాయతీ సిబ్బంది రమేష్,సబిత మహిళలు పాల్గొన్నారు.