వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గం లోని దామరచర్ల మండలం వీర్లపాలెం లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో శుక్రవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వేడి బూడిద పడి సుమారు ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన కార్మికులను మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.