• కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రోడ్డు

వేద న్యూస్, వరంగల్:

దశాబ్దాల కాలంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్లి రోడ్డు సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఆయన కృషితో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్ళేందుకు నాలుగు లైన్లు రోడ్డు నిర్మాణం పనుల కోసం రూ77.20 కోట్ల నిధులు మంజూరు కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన, యూత్ కాంగ్రెస్ నాయకులు సాహు శనిగరపు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.