వేద న్యూస్,క్రైమ్ :
రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకున్ని ప్రాణాలకు తెగించి రక్షించిన హోంగార్డ్ రవి.వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ బ్రిడ్జి వద్ద చత్తిస్ గడ్ నుండి ఉపాధికోసం వచ్చిన సోను అనే యువకుడు కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్య ప్రయత్నం గావించాడు.
అతన్ని చూసిన పలువురు అరవడంతో పక్కనే ఉన్న ట్రాఫిక్ హోంగార్డ్ రవి వెంటనే స్పందించి రైలు పట్టాల పై పడుకొని ఉన్న ఆ యువకుడిని ప్రాణాలకు తెగించి కాపాడాడు.ఈ సాహసం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది దీంతో యువకుడిని కాపాడిన పోలీస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.