వేద న్యూస్, కాజీపేట :
నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిగవంత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను 47వ డివిజన్ బాపూజీ నగర్ చౌరస్తాలో 47 డివిజన్ అధ్యక్షులు షేక్ అస్గర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇప్ప శ్రీకాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారనీ, పేదల ఆరోగ్యం కోసం 108 అంబులెన్స్, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలకు ఉచితరేషన్ బియ్యం, రైతులకు జలయజ్ఞం వంటి కార్యక్రమాలను ఎన్నో అమలు చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 47వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అస్గర్, జిల్లా జనరల్ సెక్రెటరీ ఇప్ప శ్రీకాంత్, పసునూరి మనోహర్, తమ్మడి మధు, మానస, మల్లేష్, 29వ డివిజన్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణచందర్.జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ బిలాల్(బబ్లు), ఇప్ప రాకేష్, శివ, కొంకటి శరత్, ఖురేషి తదితరులు పాల్గొన్నారు.
కాజిపేట్ చౌరస్తాలో..
వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 62,63 డివిజన్ల కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ సయ్యద్ రజాలి ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన 108,104, ఆరోగ్య శ్రీ , ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల రుణ మాఫీ, ఉచిత కరెంట్ వంటి సేవలను చేసిన ఘనత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలే నేటికి కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిల్ లారెన్స్ , మెరుగు రాజయ్య, ఆరూరి సాంబయ్య , దొంగల కుమార్, జయకర్, అజ్గర్, దువ్వ రాజులు, కుమ్మరి నాగరాజు, మహిళ నాయకురాళ్లు, లలిత, రజియా, స్వరూప, పోగుల శ్రీనివాస్, సిల్వేరు మల్లికార్జున్, ఇమ్మడి రవి, గబ్బెట ఎల్లేష్, బొంద్యాలు, శివరాం, బొడ్డు రామ్, ఓజ్జా కరుణాకర్, ఆవుల రాజేష్, నానబోయిన రవి, బిలాల్, భరత్ గాలి సీను, మాతాంగి స్వామి, రాజు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ మహిళా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.
కడిపికొండలో…
కడిపికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్మెట్ట వెంకటరమణా గౌడ్, 45వ డివిజన్ అధ్యక్షులు సట్ల సదానందం గౌడ్, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బస్కే శ్రీలేఖ, కృష్ణ, కర్ర హరీష్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కట్కూరి రేవంత్, నాయకులు అబ్దుల్ సమ్మద్, బస్కె రవి, వర్ధన్నపేట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బస్కె ప్రణయ్, నాగపూరి రాజయ్య గౌడ్, నర్మెట సుధాకర్ గౌడ్, బత్తిని విజ్జగిరి గౌడ్, దామెరుప్పుల కోటేశ్వర్, పైడిపాల శ్రీనివాస్, లదేళ్ల కుమార్, నర్మెట వేణుగోపాల్ గౌడ్,బుర్ర మధుగౌడ్, డా. శ్రీనివాస్ బుర్ర ప్రభాకర్ గౌడ్, బైరి స్వామి గౌడ్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.