- గురువులకు ఎస్ఎస్సీ 2004–05 బ్యాచ్ విద్యార్థుల ఘనసన్మానం
వేద న్యూస్, హన్మకొండ:
‘‘ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము .. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడలేమంటూ..వీడుకోలంటూ’’ అనే పాటను పాడుకుంటూ..హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని గట్ల కనపర్తి గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2004 -2005 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు అల‘నాటి’ మరపురాని తిరిగిరాని గురుతలను గుర్తుతెచ్చుకుని ఆనందోత్సాహంతో హాయిగా ఆదివారం సమయం గడిపారు.
వాట్సాప్ వేదికగా కొన్ని రోజుల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులును సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో వారి వారి చదువులను పనిని బట్టి స్థిరపడ్డవారు. ఎన్నో ఏండ్ల తర్వాత ఒకరినొకరు చరవాణి ద్వారా కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని సంతోషాలను గుర్తుచేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకొని అందరం కలుసుకోవాలని వారు చదువుకున్న పాఠశాలను వేదికగా నిర్ణయించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముందుగా చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని చెప్పారు. చదువుకునే
రోజులు, చేసే అల్లరి, వారితో కలిసి అడినఆటలు, పాడిన పాటలు, చిన్న చిన్న గ్యాంగ్ లు, స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు, అవన్నీ ఓ మధురమైనవిగా నెమరు వేసుకున్నారు.
అదేవిధంగా తమలాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు. తాము పాఠాలు చెప్పిన విద్యార్థులు వృద్ధిలోకి వచ్చి.. సమ్మేళనం ఏర్పాటు చేసి తమను సత్కరించడం ఆనందంగా ఉందని టీచర్లు పేర్కొన్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో తమ స్నేహితులు, గురువుల కోసం సమయం వెచ్చించి.. మీటింగ్ ఏర్పాటు చేసుకుని విజయవంతం చేయడం ఎస్ఎస్ సీ 2004-2005 బ్యాచ్ విద్యార్థులకే దక్కిందని ఈ సందర్భంగా విద్యార్థులు పేర్కొన్నారు.