వేద న్యూస్, హైదరాబాద్ సిటీ:
అది రాష్ట్ర రాజధానికి,పెద్ద నగరం కానీ పేరుకే పెద్ద నగరంగా మిగిలి పోయింది. మెయిన్ రోడ్డు నుంచి గల్లీ రోడ్ల దాకా మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. మురుగంతా రోడ్లపైన పరుతుండడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు చూసి మురుగు నీరు ఆగకుండా పారుతుండడంతో స్థానికులు దుర్వాసన తట్టుకోలేకపోతున్నారు.! కొండాపూర్ శరత్ మాల్ జంక్షన్ వద్ద డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే అధికారులు సమస్యను పరిష్కరిస్తున్నామని చెబుతున్నప్పటికీ, శాశ్వత చర్యలు తీసుకోవట్లేదనీ స్థానికులు ఆరోపిస్తున్నారు.