వేద న్యూస్, వరంగల్:

బొజ్జ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహిస్తున్నారు. గిర్మాజీపేట్ చార్ బాలి లోని గణనాథుడికి చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 108 నైవేద్యాలు సమర్పించారు.

భక్తులందరికీ సిద్ధి బుద్ధి ప్రసాదించాలని బుజ్జి గణపతిని వేడుకున్నట్టు యూత్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. వైభవోపేతంగా వినాయక చవితి ఉత్సవాలను అందరి సహకారంతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అందరూ బాగుండాలని .. తొలి పూజలు అందుకునే గణపతి మహరాజ్ ను ప్రార్థించినట్టు తెలిపారు.