• శాయంపేట మండలానికి ఇరవై ఐదు టన్నుల యూరియా దిగుమతి
  • మండల వ్యవసాయ అధికారి గంగాజమున

వేద న్యూస్, శాయంపేట:

 శాయంపేట గ్రామం లోని సాయి ఫెర్టిలైజర్స్ లో పదిహేను టన్నులు ,గట్ల కనపర్తి లో గల శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లో పది టన్నులు యూరియా దిగుమతి చేశారని మండల వ్యవసాయ అధికారి గంగాజమున తెలిపారు.

డి డి నంబర్ వచ్చిన వెంటనే పంపిణీ  చేస్తామని చెప్పారు. ఉదయం ప్రగతి సింగారం లో గల ఓ డి సి ఎం ఎస్ కు పది టన్నులు ,జోగంపల్లి లో గల ఓ డి సి ఎం ఎస్ కు పది టన్నుల యూరియా వస్తుందన్నారు.

రైతులు కంగారు పడవలసిన అవసరం  లేదని పేర్కొన్నారు. జోగంపల్లి లో గల ఒడిసిఎంఎస్ నుండి జోగంపల్లి , గోవిందా పూర్ రైతులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.  ఇక మిగతా సెంటర్లలో ఉన్న యూరియాను అవసరం ఉన్న రైతులు తీసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి తెలిపారు.