వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డు ఎస్బిఐ బ్యాంకు పక్కన ” వేద” కంటి, చెవి ముక్కు గొంతు ఆస్పత్రిని జూలై 21 న (సోమవారం) ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రారంభించనున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. సదరు హాస్పిటల్ లో కంటి, చెవి, ముక్కు , గొంతు వైద్య సేవలను ఎంబిబిఎస్, ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ టి. వెంకట సాయి నేత్ర, ఎంబిబిఎస్, ఎంఎస్ ఈ ఎన్ టి డాక్టర్ ఎస్ నిఖిత అందించనున్నారు.
“వేద” EYE, ENT ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) హుజురాబాద్, జమ్మికుంట శాఖ అధ్యక్షుడు డాక్టర్ అంకం సుధాకర్, కార్యదర్శి డాక్టర్ ఊడుగుల సురేష్, సీనియర్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంబిబిఎస్ డిఏ డాక్టర్ కే సురేంజన్, కెమిస్ట్ , డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వెంకటేశ్వర్లు తదితరులు హాజరుకానున్నారు