వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ ‘అమ్మ’ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆగస్టు 3, 5 తేదీల్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 3న (ఆదివారం) ఫస్ట్ బుక్ చేసుకున్న 30 మందికి ఈసీజీ, ఓపీ ఉచితంగా గుండె వైద్య నిపుణులు, కార్డియాలజిస్ట్ (ఉస్మానియా), ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భగీరథ్ అత్తె చూస్తారని తెలిపారు. ప్రతి ఆదివారం డాక్టర్ భగీరథ్ పేషెంట్లను చూస్తారని వెల్లడించారు.
ఆగస్టు 5న (మంగళవారం) బుక్ చేసుకున్న 50 మందికి ఉచితంగా వైద్యులు చూస్తారని పేర్కొన్నారు. డాక్టర్ వి.కృష్ణకాంత్ రుమాటాలిజిస్ట్ (ఎం.ఎస్. ఆర్తో ఎఫ్ఈఓఆర్ఏ.. చూస్తారని తెలిపారు. ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు దీర్ఘకాలిక ఉపశమనం కలిగిలే ట్రీట్ మెంట్ ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రతి మంగళ, శుక్రవారం డాక్టర్ వి.కృష్ణకాంత్ అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మ్ ఇంజక్షన్ లు కూడా వేయనున్నట్టు వెల్లడించారు.