- స్కూల్లో అసలేం జరిగింది?
వేద న్యూస్, వరంగల్:
విద్యార్థులందరూ హాయిగా గ్రౌండ్లో ఆడుకుంటుండగా, ఓ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం కలకలం రేపుతోంది. చెవులు, ముక్కు నుండి రక్తం కారి పదో తరగతి విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది.
హన్మకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన గురువారం జరిగింది. మృతి చెందిన విద్యార్థి జయంత్(15)గా గుర్తించారు. సదరు స్టూడెంట్ను కుప్పకూలిన వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే విద్యార్థి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది.
కాగా, టీచర్లే విచక్షణారహితంగా కొట్టారని, అందుకే తమ పిల్లాడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.