- ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ సాంక్చువరీలో..
- ఔల్స్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, బీసీఎస్, మోత్ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో..
వేద న్యూస్, వరంగల్:
ఈ నెల 6 నుంచి 9 వరకు ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో బట్టర్ ఫ్లై(సీతాకోకచిలుక), మోత్ లపై సర్వే నిర్వహించనున్నట్టు ఔల్స్ వారు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఔల్స్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, బీసీఎస్, మోత్ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. 6వ తేదీ(గురువారం) డీఎఫ్వో ఆఫీసు ములుగు వద్ద ఓరియెంటేషన్ ఉంటుందని, 7,8,9 తేదీల్లో సర్వే ఉంటుందని వెల్లడించారు.
అనుభవజ్ఞులైన సర్వేయర్లకు ప్రాధాన్యత ఉంటుందని, 10 శాతం సీట్లు ఫస్ట్ టైమ్ సర్వేయర్లకు రిజర్వ్ చేసినట్టు స్పష్టం చేశారు.
ఈ సర్వేకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను ఇందారం నాగేశ్వరరావు 9985549900, కృష్ణవేణి 7382619346 నంబర్లలలో సంప్రదించి తెలుసుకోవచ్చని సూచించారు