• మోతుగూడ సర్పంచ్ అభ్యర్థి బొట్టుపల్లి గోపాల్

వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:

మోతుగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ గా తనకి అవకాశం ఇస్తే గ్రామపంచాయతీ అభివృద్ది కి కృషి చేస్తానని బిజెపి   బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొట్టుపల్లి గోపాల్ అన్నారు.

బుధవారం మోతుగూడ గ్రామపంచాయతీ లో తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుడైన తనను గెలిపిస్తే గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చి దిద్దుతానని చెప్పారు.

అంతకుముందు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు తో కలిసి ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అతనితో పాటు వార్డు సభ్యులుగా దూడీసే శ్రీకాంత్, బోయిరే రాజేందర్, కురాట్ కార్ రమేష్ లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రసాద్, దీపక్, రాజుర, మోతుగూడ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.