వేద న్యూస్, జమ్మికుంట:
ప్రతీ ఒక్కరూ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే చాలు.. తప్పనిసరిగా డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే. ఆ సందర్భంలో వైద్యుడు .. పేషెంట్లను వారి సమస్య గురించి అడిగి.. మందుల చిట్టీ(ప్రిస్క్రిప్షన్)పైన ఆర్ అనే ఆంగ్ల ఆక్షరం రాసిన తర్వాతనే మందులు, సిరప్ లు రాస్తుండటం మనం గమనించొచ్చు.
అయితే, అసలు ఆర్ అనే అక్షరం ఎందుకు రాస్తారనే సంగతి దాదాపుగా చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో అసలు ఆర్ సింబల్ అర్థమేమిటి, వైద్యుల సింబల్‌లో రెండు నాగుపాములు ఎందుకు ఉంటాయనే విషయాలను గురించి ‘వేద న్యూస్’… ప్రముఖ వైద్యుడు, గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ ను అడగగా, ఆయన సవివరంగా తెలిపారు. ఆ డీటెయిల్స్ ఏంటో మీరూ చదివి తెలుసుకోండి..
డాక్టర్లు మందులు రాయడం ప్రారంభించే ముందు ‘‘℞ లేదా R’’ అని రాస్తారు. ఇది లాటిన్ భాషలో ఉన్న పదం “రెసిపీ’’ నుంచి వచ్చింది. దాని అర్థం “తీసుకోండి” అని, లేదా “వాటిని తీసుకోవాలని రోగికి సూచన”. “ఇక్కడ నుంచి నేను రాస్తున్న మందులు అన్నీ పేషెంట్ తీసుకోవాలి.” అని స్పష్టంగా చెబుతున్నట్టు మీనింగ్. ఈ నేపథ్యంలోనే ప్రపంచమంతా ప్రిస్క్రిప్షన్ ఇలా ℞ తో ప్రారంభమవుతుంది.
డాక్టర్ సింబల్‌లో రెండు నాగుపాములున్నట్టు మనం సాధారణంగా గమనించొచ్చు. దాని అర్థం (డ్యూసస్” / “రాడ్ ఆఫ్ అస్క్లిపియస్”).. ఒక దండపై ఒక నాగుపాము ఉన్నది లేదాఒక దండపై రెండు నాగుపాములు చుట్టుకుని ఉన్నది (కొన్నిసార్లు రెక్కలు కూడా ఉంటాయి) ఇవీ మనం వైద్యుల వాహనాలపైన కానీ సోషల్ మీడియాలో వైద్యులకు సంబంధించిన పోస్టులలో గమనించొచ్చు. వీటి అర్థం ఏమిటంటే..
రాడ్ ఆఫ్ అస్క్లిపియస్ ఒక దండ, దాని చుట్టూ నాగుపాము..ప్రపంచ వైద్య సంకేతం కాగా, అస్క్లేపియస్ అనే గ్రీకు వైద్య దేవుని సూచిస్తుంది. వీటి అర్థం ఆరోగ్యం, చికిత్స, వైద్య సేవ ప్రాణరక్షణ. అయితే, రెండు నాగుపామలు దండ అనేది తప్పుగా వాడుతున్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. అది గ్రీకు దేవుడు హెర్మిస్ కు సంబంధించిన సంకేతం అని, దాని అర్థం: సందేశవాహకుడు, వాణిజ్యం, ప్రయాణం అని వెల్లడిస్తున్నారు.
వైద్య చిహ్నంలో పాము ను ఎందుకు వాడుతున్నారంటే.. పాముకు తన చర్మం మార్చుకునే గుణం ఉంది , అలాగే పాములో విషం కూడా ఉంది, చిన్న మోతాదులో ఔషధం లా పనిచేస్తుంది. పాతకాలంలో పాము విషాన్ని మందుల తయారీలో ఉపయోగించేవారు.. అందుకే పామును ఆరోగ్యం, చికిత్సకు చిహ్నంగా వాడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఆర్ అనగా రెసిపీ“ఇక్కడ నుండి మందులు తీసుకోండి” అని అర్థం కాగా, ఒక పాము ఉన్న దండ ..‘‘ అసలు వైద్య చిహ్నం (అస్క్లిపియస్), రెండు పాములు ఉన్న దండ (కాడ్యుసెస్).

