వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి:
వేములవాడకు చెందిన నాగుల రాముగౌడ్ మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహరావు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న రాముగౌడ్ ఇటీవల 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అభివృద్ధి లక్ష్యంగానే బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజానందరావు, నరాల దేవేందర్, మాజీ కౌన్సిలర్ గోలి మహేష్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *