= దైవాల వేణుకుమార్

వేద న్యూస్, రామడుగు:
రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో గురువారం నిర్వహించిన ఇంగ్లీష్ క్లబ్ ముగింపు కార్యక్రమానికి అంతర్జాతీయ మెమొరీ ట్రైనర్ దైవాల వేణుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీష్ కేవలం ఒక భాష మాత్రమే కాకుండా జీవనశైలిగా మారిందన్నారు. ఆధునిక కాలంలో ప్రపంచంతో అనుసంధానం కావడానికి ఇంగ్లీష్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పరేడ్‌కు అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. ఇంగ్లీష్ క్లబ్ మ్యాగజైన్‌ను ఆవిష్కరించి, ఇంగ్లీష్ వ్యాకరణ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ ఉప్పుల శ్రీనివాస్, కో-కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, విశ్వమ్ ఎడ్యుటెక్ రీజినల్ హెడ్ బి. వినాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *