వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్, ఎనిమిదవ తెలంగాణ బెటాలియన్ గర్ల్స్ ఆధ్వర్యంలో 76వ ఎన్సిసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు సోమవారం తెలిపారు. ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి 10 తెలంగాణ బెటాలియన్ సుబేదారి మేజర్ సుహాస్ కదం హాజరై మాట్లాడుతూ దేశ సేవ కోసం ఎన్సిసి లో ప్రవేశాలు పొందాలని యూనిఫామ్ అనేది సమాజం ఎంతో గౌరవిస్తుందని చెప్పారు. భారత ఆర్మీకి రెండవ లైన్ అయినా ఎన్సిసి ఎంతో యువతకు జీవితంలో స్థిరపడడానికి ఉన్నత స్థానాలు చేరుకోవడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

ప్రపంచంలోని అతిపెద్ద యువ రక్తంతో నిండిన ఆర్గనైజేషన్ ఎన్సిసి అని, ఇది దేశభద్రతలో పునాదిరాళ్లు లాగా ఆర్మీకి రెండవ సపోర్టు లైన్ గా ఉంటుందని వెల్లడించారు. ఇందులో చేరడం అంటే ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారు. కఠినమైన శిక్షణ ద్వారా మంచి నాయకత్వ లక్షణాలు, శిక్షణ ద్వారా నేర్చుకున్న పట్టుదల కమాండర్ షిప్, దేశభక్తి ,దేశ సేవ,దేశభివృద్ధిలో భాగస్వామ్యం ఇవన్నీ ఎన్సిసి ద్వారా పొందుతారని వివరించారు.

ఇవే కాకుండా ఎన్సిసి సర్టిఫికెట్ పొందడం ద్వారా ఉద్యోగ అవకాశాల్లో ఆర్మీలో నేరుగా ప్రవేశ పొందడానికి రాజమార్గమని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకు ఇద్దరు క్యాడేట్స్ ఎంపికైనట్లు చెప్పారు. వరంగల్ గ్రూపులో ఎన్సిసి ఎల్బీ కళాశాల ఒక హబ్ లాగా యువతకు రోల్ మోడల్ లాగా కళాశాల ఉందని వెల్లడించారు. అనేకమంది పోలీస్, ఆర్మీలో ఈ సంవత్సరం ఉద్యోగాలు పొందారని..వారందరికీ ఎన్సిసి డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పోటీలు నిర్వహించి క్యాడేట్స్ కు బహుమతులు ప్రిన్సిపాల్, ఆర్మీ అధికారులు ప్రదానం చేశారు.

కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి, ఆర్మీ జూనియర్ కమిషన్ అధికారులు సౌరస్య, బెటాలియన్ అవల్దార్ మేజర్ ఇజాజ్ మహమ్మద్, నారాయణరెడ్డి, భాష, అధ్యాపకులు వి మధుకర్ రావు, ప్రశాంతి, సుధాకర్, రజిని, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సిసి బెటాలియన్ నుండి పిఐ స్టాప్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి.