- ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి
- సీనియర్ జర్నలిస్టు మధు పిలుపు
వేద న్యూస్, వరంగల్ టౌన్ :
రక్త దానం ప్రాణ దానంతో సమానం అని సీనియర్ జర్నలిస్టు పెరుమండ్ల మధు అన్నారు. సోమవారం తన జన్మదిన సందర్భంగా ఎంజీఎంలోని రక్త దాన నిధిలో రక్తదానం చేశారు. ఆయనతో పాటు తన మిత్రులు దాదాపు 20 మంది మిత్రుడి పుట్టిన రోజున రక్త దానం చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. అనంతరం సీనియర్ జర్నలిస్టు పెరుమాండ్ల మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్త దానం చేయాలని కోరారు. పుట్టినరోజుల సందర్భంగా సంబరాలు జరుపుకుంటూనే మానవ సేవ కూడా చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో, నగరంలో ఏదో ఒకచోట రక్తం సరైన సమయానికి అందక అనేకమంది ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. కావున 18 సంవత్సరాలు నుండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.