వేద న్యూస్, కరీమాబాద్ : పోలియో రహిత సమాజమే మన అందరి లక్ష్యమని చిన్నారుల ఆరోగ్యవంతమైన జీవనానికి పల్స్ పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అత్తర్ అన్నారు. ఆదివారం డివిజన్ లోని కరీమాబాద్ రమేశ్వర్ అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇప్పించాలన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేశ్వర్ అంగన్వాడీ సెంటర్ టీచర్ అంజలి, డివిజన్ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
