వేదన్యూస్ తెలంగాణ

జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5లోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆధార్, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్, దరఖాస్తు ఫాం నింపి AEOలకు సమర్పించాలని తెలిపారు. జులై 5 దాటితే మరో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కాగా జూన్ 30 నుంచి ప్రభుత్వం రైతుభరోసా నిధులను (ఎకరానికి రూ.6వేలు) విడతల వారీగా విడుదల చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *