వేద న్యూస్ , ఇల్లందకుంట:

మండల కేంద్రానికి చెందిన సోమిడి మదనమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె కుమార్తె కోమల పదో తరగతి మిత్రబృందం (2003) సభ్యులు విషయం తెలుసుకుని మదనమ్మ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో మిత్రబృందం తరఫున రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన 2003 పదో తరగతి మిత్రబృందానికి  కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *