• తల్లిదండ్రుల జ్ఞాపకార్థం హనుమాన్ దేవాలయ కమాన్ నిర్మాణం

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల గ్రామానికి చెందిన స్వర్గీయ తోట రాయలింగు – ఆగమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి వారసులు సత్కార్యం చేపట్టారు.

తనుగుల హనుమాన్ దేవాలయానికి రోడ్ ద్వారం వద్ద రూ.  24 వేల తో ఐరన్ కమాన్ చేయించి, వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిలిపారు.

గతంలో మెయిన్ రోడ్ నుండి గుడి వరకు సిమెంట్ రోడ్ వేస్తున్న సందర్భంలో గ్రామ పెద్దల కోరిక మేరకు రోడ్ నిర్మాణానికి కొంత స్థలాన్ని ఇచ్చారు. సర్పంచ్ కిరణ్ మాట్లాడుతూ.. వీరి కుటుంబ సభ్యులు గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈ పనులు చేయించడం ఎంతో అభినందనీయమన్నారు. సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ.. గతములో స్కూల్ విద్యార్ధులు అందరికీ మధ్యాహ్నం భోజనం ప్లేట్లు అందించడం, పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కే కిరణ్, సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్, గ్రామ పురోహితులు వల్లూరి పవన్ కుమార్, విష్ణు అయ్యగారు, వాసాల సుధీర్, దేవేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యాదకిషన్, రాజు,దాసారపు రాజయ్య, ప్రశాంత్, సంజీవ్, సంపత్, కొమురయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, దాత కుటుంబసభ్యులు తోట రాజు, సరిత, లక్ష్మీ ప్రియ, ఈశ్వర్ కార్తీక్, స్వరూప, కౌటమ్ రాజ్ కుమార్, అంజలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *