వేద న్యూస్, పర్వతగిరి :
తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. పర్వతగిరి నుంచి కొంకపాకలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది చేసిన త్యాగాలకు సెప్టెంబర్ 17 చారిత్రక గుర్తుగా నిలిచిందని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఈ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని, తెలంగాణలో కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ప్రజలు సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హర్కావత్ వినోద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు కుడికాల శ్రీధర్ యువ మోర్చా అధ్యక్షులు గొల్లపల్లి సంతోష్ కుమార్ వర్ధన్నపేట మండల అధ్యక్షులు అడుపరాజు, జిల్లా నాయకులు జలంధర్, చంద్రయ్య, నరసయ్య, లక్ష్మణ్, రంజిత్, మహేష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు
