ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం

వేద న్యూస్, పాపన్నపేట

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆలయం కార్తీక మాసం సందర్భంగా నిత్యం దీప కాంతులతో విరాజిల్లుతోంది.కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శనివారం రోజు రాత్రి ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపోత్సవ వేడుకలను ఆలయ పూజారులు పార్థివ శర్మ, శంకర్ శర్మలు అత్యంత సుందరంగా ముస్తాబు చేసారు.
మంజీరా నదీ తీరాన వెలిసిన అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ఈదీపోత్సవ వేడుకలకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా ప్రమిదల వెలుగులతో దేదీప్యమానంగా మెరిసిపోయింది.మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో మట్టి ప్రమిదలను వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తులు దుర్గా నామ స్మరణతో'”జై దుర్గా మాతకు జై”అంటూ ఉస్తావంలో పాల్గొన్నారు. దుర్గా నామస్మరణతో ఏడుపాయల ప్రాంతమంతా మార్మోగింది.
ఆలయ గోపురం వద్ద ప్రత్యేక ధ్వజస్తంభానికి అర్చకులు ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించి పైకి ఎగురవేశారు. లోకకల్యాణం,ప్రజల సుఖశాంతుల కోసం ఈ దీపాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకాశంలో ఎగసిన ఈదీప కాంతులను చూసి భక్తులు భక్తిభావంతో పరవశించి పోయారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్,ప్రతాప్ రెడ్డి,పల్లె సాయిబాబా, మధుసూదన్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఆయా ప్రాంతాల్లో నుండి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *