అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు..

వేద న్యూస్, పాపన్నపేట 

అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.మెదక్ నుంచి బొడ్మట్ పల్లి వైపు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా నార్సింగి గ్రామ శివారులో ఒక ఇసుక టిప్పర్ ను, మరో వైపు మండల పరిధి ఎన్కేపల్లి గ్రామ శివారులోని మంజీరా నది నుంచి అనుమతులు లేకుండా అచ్చన్నపల్లి వైపు వెళ్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ ను సైతం పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్, ట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…మండలంలోని మంజీరా నది, చెరువులు, కుంటల నుంచి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *