• మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గెలుపు

వేద న్యూస్, మహేశ్వరం:
మహేశ్వరం నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రా రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ పట్టణంలో వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేశారు. సరూర్ నగర్ చౌడి సర్కిల్ వద్ద బాణసంచా పేలుస్తూ స్వీట్లు పంచుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ బేరా బాలకిషన్ (బాలన్న ), డివిజన్ అధ్యక్షులు బోయిన మహేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ సబిత ఇంద్ర రెడ్డి గెలుపే లక్ష్యంగా రెండు నెలలుగా కష్టపడి పని చేసిన ప్రతీ కార్యకర్తకు..ప్రతీ నాయకునికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.

ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్ లోని కాలనీలకు, ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని సబితమ్మ నాయకత్వంలో..ప్రతీ సమస్య పరిష్కారానికి కృషిచేసి అమలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాల ద్వారా.. సరూర్ నగర్ డివిజన్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ జనరల్ సెక్రెటరీ సుదర్శన్ ముదిరాజ్, సీనియర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నాగమణి, సాలమ్మ, భాగ్యలక్ష్మి, ఉష సరస్వతమ్మ, అమరావతి ఇస్మాయిల్, జహీర్ రజాక్ బాల్రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.