తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 25 నియోజకవర్గాలలో “కుశి టీమ్” అనే సంస్థ చేసిన సర్వే ఫలితాలు నిజమయ్యాయి. పది రోజుల కిందటే సర్వే ఫలితాలను “కుశి టీమ్” వెల్లడించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 9 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ స్థానాలని గెలుచుకుంటుందని తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు సంబంధించి 9 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 3 బీజేపీ గెలుచుకుంటుందని పేర్కొంది.

కుశి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..దాదాపుగా నేడు(ఆదివారం) వెలువడిన ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 54 నుండి 58 సీట్లు, బీఆర్ఎస్ 44 నుండి 46 సీట్లు, బీజేపీ16 నుండి19 సీట్లు, ఎంఐఎం5 నుండి 6 సీట్లు గెలుస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల 9 న సోనియా గాంధీ జన్మదినం రోజున నూతన ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రకటించింది.

గతంలో 2021లో జరిగిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమయంలో చేపట్టిన సర్వేలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని తెలుపగా, అదే నిజమైంది. కాగా, భవిష్యత్తులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల సరళి పై ప్రత్యేక విశ్లేషణతో కూడిన కచ్చితత్వమైన సర్వేలను చేపట్టబోతున్నామని ‘కుశి టీమ్’ సర్వే సంస్థ వ్యవస్థాపకులు కుసుంబ శివాజీ పేర్కొన్నారు.