• 1729, ప్లస్ మైనస్ సింబల్స్ ఆకృతిలో కూర్చొన్న స్టూడెంట్స్
  • భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్తకు ఘన నివాళి

వేద న్యూస్, వరంగల్/కరీమాబాద్:
కరీమాబాద్ లోని బ్రిలియంట్ ఉన్నత పాఠశాల లో జాతీయ గణిత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు తమ గణిత ప్రాజెక్టు‌ల గురించి వివరించారు. విద్యార్థులకు గణితం పట్ల ఉన్న ఆసక్తిని చసి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గణిత శాస్త్రవేత్త, మేధావి శ్రీనివాస రామానుజన్ కు ఇష్టమైన 1729 నెంబర్, ప్లస్, మైనస్ సింబల్స్ ఆకృతిలో విద్యార్థులు కూర్చొని శాస్త్రవేత్తకు నివాళి అర్పించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ బండి మోహన్, పాఠశాల డైరెక్టర్ బండి అవినాష్, ప్రిన్సిపాల్ విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గొప్పతనాన్ని, గణిత సబ్జెక్టు ప్రాముఖ్యత‌ను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.