వేద న్యూస్, మందమర్రి:
మందమర్రి సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. అధ్యక్షులుగా బర్ల నాగ మల్లేష్, ఉపాద్యక్షులుగా గుంటి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా బర్ల చంద్రశేఖర్, కోశాదికారిగా సిహెచ్ శ్రీనివాస్ లను ఏకగ్రీవం ఎన్నుకున్నట్లు తెలిపారు. స్టీరింగ్ కమిటీ డిసెంబర్ 15న ప్రకటించినా నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18,19 తేదీలలో పోటీ చేయుటకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డిసెంబర్ 20వ తేదీన ఉపసంహరణ, డిసెంబర్ 22న ఎన్నికలు నిర్వహించడానికి స్టీరింగ్ కమిటీ ప్రకటించింది.
అన్ని పదవులకు గాను సింగిల్ నామినేశన్ వచ్చినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికైన వారికి ధృవీకరణ పత్రాలు శుక్రవారం ఉదయం సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఓనర్స్ అసోసియేన్ కార్యాలయంలో అందజేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు తోటి కాంట్రాక్టర్లు అభినందనలు తెలియజేశారు, నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి 11 డివిజన్ ల అధ్యక్షుడు కనుకుల మొండయ్య, ఆర్ జీవన్ అధ్యక్షుడు టి రాజలింగు, ప్రధాన కార్యదర్శి ఎ రామ్ రెడ్డి, కోశాధికారి ఎ రాజమౌళి, ఉపాధ్యక్షుడు కురుమ శ్రీనివాస్, శ్రీరాంపూర్ గౌరవ అధ్యక్షుడు బొడ్డయ్య, బెల్లంపల్లి అధ్యక్షుడు గోపికృష్ణ, ఆర్ జి 3 నుండి ఎన్ శంకర్, ఎన్ సమ్మయ్య, ఎన్నికలు నిర్వహించిన స్టీరింగ్ కమిటీ సభ్యులు పి రాజమల్లు, పోతుల పరంధం కుమార్, గోమాస వెంకటేష్, బర్ల రాజకుమార్, మెరుగు దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.