వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణా రాష్ట్ర వైస్ చైర్ పర్సన్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి కి రాష్ట్ర బెస్ట్ లీడర్ అవార్డును వరంగల్ రోటరీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన జాతీయ వియోగదాల దినోత్సవ వేడుకల సెమినార్ లో జిల్లా మెట్రాలజీ శాఖ సహాయక కమిషనర్ రాజేశ్వర్, ది. ఎన్సీఆర్సి ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్, డాక్టర్ రామానుజ స్వామి తదితర అతిథులు ప్రదానం చేశారు. సోమవారం అనితారెడ్డి అతిథుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
వినియోగదారులు రక్షణ చట్టం పై వందల సంఖ్య లో గ్రామ స్థాయి నుండి నగర స్థాయి వరకు అవగాహనా సదస్సులు, సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఈ అవార్డును అనితారెడ్డికి అందించామని తెలిపారు. డాక్టర్ అనితా రెడ్డి సమాజానికి అందిస్తున్న సేవలు అందరికీ స్పూర్తి దాయకంగా ఉన్నాయని జిల్లా తునికలు కొలతల శాఖ సహాయ కమిషనర్ రాజేశ్వర్, మెట్రాలజీ శాఖ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ది. ఎన్సీ. ఆర్సి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సాయి రమేష్, అడ్మిన్ చైర్మన్ డాక్టర్ రామానుజ స్వామి చెప్పారు.
డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. అవార్డు మరింత భాద్యత పెంచిందని వెల్లడించారు. ఇకముందు మరింత విస్తారంగా అవగాహనా సదస్సులు, అవసరార్దులకు సేవా కార్యక్రమాలు చేపడుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ సాంబమూర్తి, సెక్రటరీ రాంరెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.