• మంత్రికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి రిక్వెస్ట్
  • సానుకూలంగా స్పందించిన ఇన్‌చార్జి మినిస్టర్ ఉత్తమ్

వేద న్యూస్, కరీంనగర్:
కల్యాల లక్ష్మీ చెక్కుల పంపిణీకి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..జిల్లా ఇన్ చార్జి మంత్రిని కోరారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ లో ‘ప్రజా పాలన’ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ మాట్లాడుతూ ‘కల్యాణలక్ష్మి’కి సంబంధించిన ఇప్పటికే విడుదలైన 200కు పై చిలుకు చెక్కులు ఉన్నాయని, వాటిని వెంటనే అందించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా ఇన్ చార్జి మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరారు.

ఎన్నికల కోడ్ వల్ల చెక్కుల పంపిణీ ఆగిపోయిందని చెప్పారు. ‘కల్యాల లక్ష్మి’ చెక్కులు వెంటనే పంపిణీ చేయాలని, లేదంటే అవి ల్యాప్స్ అవుతాయని వివరించారు. మంత్రి ఉత్తమ్ ఈ విషయమై సానుకూలంగా స్పందించారు. తాను కలెక్టర్ తో మాట్లాడతానని చెప్పడంతో..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.