వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట:
కరీంనగర్ జిల్లాకేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఐటీ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు, జిల్లాకు మొదటిసారి విచ్చేసిన జిల్లా ఇన్ చార్జి, పౌరసరఫరాల శాఖ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఘన స్వాగతం పలికారు.
బుధవారం సమ్మిరెడ్డి మంత్రులకు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాపాలన’ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. మంత్రులను కలిసిన వారిలో జమ్మికుంట మాజీ మార్కెట్ డైరెక్టర్ నల్లా కొండాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.