•  కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్

వేద న్యూస్, వరంగల్:
అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేశ్ అన్నారు. శనివారం ఆమె ఖిలా వరంగల్ పడమర కోట అర్బన్ హెల్త్ సెంటర్ నుండి గంగదేవి గండి వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ రోడ్డు వల్ల తూర్పు కోట కు, పడమర కోటకు..అలాగే రింగ్ రోడ్డు కు అనుసంధానంగా అందరికీ సౌకర్యం గా ఉంటుందని చెప్పారు.

5 సంవత్సరాల ప్రజల ఆకాంక్ష నిరవేరుతోందని కార్పొరేటర్ తెలిపారు. అభివృద్ధి పనులను కొనసాగించేందుకు నూతన ప్రభుత్వం ముందుకు సాగాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అనుమతులు పొందిన డివిజన్ పరిధిలోని రూ.6 కోట్ల పనులను కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. ఈ పనుల వల్ల డివిజన్ లో అనేక రకాల అభివృద్ధి పనులు జరిగి..ప్రజలకు ఉపయోగం ఉంటుందని వెల్లడించారు.