వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రయంలో ‘2023 వీడ్కోలు 2024 స్వాగతం’ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి.. మహిళలు ఆనందం గా కేక్ ను కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ రాబోయే కొత్త సంవత్సరం లో అందరూ అనుకున్నవన్నీ జరిగి..ప్రతి రోజూ సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.
జీవితం ఆనందాల హరివిల్లు కావాలంటే కోపం, అసూయ, ద్వేషాలు వదిలివేయాలని సూచించారు. ఏ క్షణాన ఏమి జరుగునో మనకు తెలియదని, 365 రోజులు గడిచి పోవటానికి ఇంకా ఒక్క రోజే ఉన్నది ఈ సంవత్సరం పూర్తిగా కావడానికి ఇంకా కొద్ది సమయమే ఉందని చెప్పారు. ఈ సంవత్సరం మీకు సంతోషంగా గడిచిపోవాలంటే మీ పట్ల ఎవరైనా తప్పుచేసినట్లైయితే, బాధ పెట్టి నట్లఅయితే ప్రేమతో వారిని క్షమించాలని పేర్కొన్నారు.
ఎవరి పట్ల కోపం ఉంచుకోవద్దని, ఇప్పడి వరకు జీవితం లో జరిగిన బాధకరమైన ఘటనలు మరచిపోవాలని వెల్లడించారు. స్వధార్ మహిళలు కొత్త జీవితానికి బాటలు వేసుకోవాలని స్పష్టం చేశారు. తన సహకారం వారికి ఎప్పటికీ ఉంటుందని హామీనిచ్చారు.
‘‘అందరిని గౌరవిద్దాం, అందరిని ప్రేమిద్దాం, మంచిని కోరుకుందాం’’ అని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. అనంతరం మహిళలకు ఫ్రూట్స్, స్వీట్లు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, శైలజ, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.