వేద న్యూస్, ఎలిగేడు:
ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో శ్రీ రామ పూజిత అక్షింతల వితరణ మహత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీ రాముని అక్షింతల వితరణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. గ్రామ ప్రజలు..‘‘జై శ్రీరామ్’’ అంటూ నినాదాలు చేశారు. నిర్వాహకులతో కలిసి ప్రజలు శ్రీ రాముని అక్షింతలను ఇంటింటా పంపిణీ చేశారు.