వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి:
రేకుర్తి కంటి ఆస్పత్రి, గర్మిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాలలోని నారాయణ ఉన్నత పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోదుంపురం వెంకటేశ్వర్, నేత్ర వైద్యులు డాక్టర్ అభిషేక్, నేత్ర నిపుణులు సిహెచ్ ప్రభాకర్ లు మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 150 మంది తమ పేర్లు నమోదు చేసుకొని, వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, బీపీ, షుగర్ పరీక్షలు అనంతరం 60 మంది కంటి ఆపరేషన్ కొరకు అర్హత సాధించారని తెలిపారు.
రేకుర్తి ఆసుపత్రి మార్గదర్శకాల ప్రకారం గురువారం 30 మందిని, మరో 30 మందిని రెండో విడతగా రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నిర్వహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్ పర్సన్ సుగుణాకర్ రెడ్డి, జోనల్ చైర్ పర్సన్ సద్దెనపు రామచందర్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీరామోజీ రమేష్ బాబు, కార్యదర్శి సిహెచ్ రాఘవేంద్రరావు, కోశాధికారి బళ్ళు శంకర్ లింగం, సభ్యులు అంకులు, వేముల ప్రవీణ్, నారాయణ పాఠశాల సిబ్బంది అపర్ణ, శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.