• నీళ్లు తాగాలంటేనే భయమేస్తోంది!
  • మురుగు నీరు పక్కనే తాగునీరు
  • అసలు ఆస్పత్రి ఆవరణం ఇలా ఉంటుందా?

వేద న్యూస్, వరంగల్ :
స్మార్ట్ సిటీగా పేరొందిన వరంగల్ నగరంలోని సీకేఎం ప్రసూతి హాస్పిటల్‌లో తాగునీరు తాగాలంటే రోగులు, రోగుల బంధువులు వణికిపోతున్నారు. తాగునీరు ఏర్పాటుచేసిన ప్రాంతంలో చుట్టూ మురుగు నీరు చేరడంతో తాగు నీరు కలుషితంగా మారుతోంది. దీంతో ఆ నీరు తాగాలంటే జనాలు జంకుతున్నారు. అసలు ఆస్పత్రి ఆవరణం ఇలా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు.

సీకేఎం ఆస్పత్రికి వరంగల్ జిల్లా చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే జనం ఎక్కువగా ఉంటారు. ఆస్పత్రిలో తాగునీటికి వేరే ఏర్పాట్లు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో అదే నీటిని కొందరు తాగుతున్నారు. తాగునీరు అందించే చోట పరిశుభ్రంగా ఉంచాలని కొంతమంది రోగుల బంధువులు ఆస్పత్రి సిబ్బందిని అధికారులను వేడుకుంటున్నారు.