వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలో అయోధ్య రాములోరి అక్షంతలు వితరణ చేశారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో గణేష్ నగర్ లో హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మికుంట పట్టణంలోని 8 మరియు 22 వార్డ్ లో ఇంటింటికి రామజన్మభూమి అక్షింతలు పంపిణీ చేశారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను రాములోరి కరపత్రాలను ప్రత్యేక పూజలు నిర్వహించి ..రాముని ఫోటో ను ప్రతి ఇంట్లో అందజేశారు.

జమ్మికుంట పట్టణ సంయోజకుజీడి మల్లేష్ మాట్లాడుతూ 22న అయోధ్యలో శ్రీ బాల రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ప్రతి ఇంట్లో దీపావళి పండుగలా జరుపుకొని.. సాయంత్రం సూర్యుడు అస్తమిం చిన తరువాత ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని కోరారు. కార్యక్రమంలో జీడి మల్లేష్, ఆవాల రాజిరెడ్డి,మోతే స్వామి, ఇటికల సరూప, కనమల లక్ష్మి , కొండ్ల సులోచన, మైస భాగ్య, మోతే అర్జున్, తాళ్ల పెళ్లి తిరుపతి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు