• వరంగల్ సీపీకి ఆహ్వానపత్రిక అందజేత

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/కొత్తకొండ:

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝూను ఆహ్వానించారు. వీరభద్రస్వామి సమేత భద్రకాళి దేవి కల్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న క్రమంలో స్వామి వారి సన్నిధికి రావాలని..సీపీని వీరభద్రస్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి పి.కిషన్ రావు, ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, అర్చకులు గుడ్ల శ్రీకాంత్, అర్చక నందనం శ్రవణ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా బుధవారం ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆలయ విశిష్టిత గురించి అర్చకులు తెలిపారు. స్వామి వారి అనుగ్రహం, ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీని సత్కరించారు. స్వామి వారి ఫొటోను, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కు దేవస్థానం తరఫున ఈవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.