వేద న్యూస్, హనుమకొండ:
ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్ ను హన్మకొండ జిల్లాలోని ప్రతీ ఆరె కుటుంబానికి కమిటీ సభ్యులు ఉచితంగా అందిస్తున్నారు. గురువారం కమలాపురం మండలంలోని పదమూడు గ్రామాల్లో ఉన్న ఆరె కుల బంధువులకు నూతన సంవత్సర క్యాలెండర్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా జిల్లా ముఖ్య సలహాదారులు పేర్వాల లింగమూర్తి మాట్లాడుతూ ఆరె కులానికి ఓబీసీ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర నాయకుల కృషితో ఓబీసీ సమస్య తుది అంకానికి చేరిందని స్పష్టం చేశారు.
ఆ సర్టిఫికెట్ వచ్చేంతవరకు ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్ఈఈటీ, ఐఐఎం లాంటి జాతీయ విద్యా సంస్థల అడ్మిషన్ గాని జాతీయ స్థాయి ఉద్యోగాలు గాని అప్లై చేసుకునే విద్యార్థులు..స్థానిక తహసీల్దార్ నుంచి ఈడబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ పొంది అప్లై చేసుకోవచ్చని సూచించారు. ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కు ఆరెకుల విద్యార్థులు అర్హులని తెలిపారు. ఏ మండలంలో అయినా అధికారులు ఆరె కులానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వనట్లయితే జిల్లా కమిటీ సభ్యులకు గాని, రాష్ట్ర కమిటీ సభ్యులను గాని, సంప్రదిస్తే ఇప్పిస్తామని హామీనిచ్చారు
. కమలాపురం మండల అధ్యక్షులు కదం రాములు మాట్లాడుతూ ఆరె కుల ఆరాధ్య దైవ సమానులు ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాజానికి ఒక స్పూర్తి ప్రదాత అని చెప్పారు. నేటి పాలకులకు ఆదర్శ ప్రాయుడు అని వెల్లడించారు. సుమారు 350 సంవత్సరాల క్రితమే అభివృద్ధి సంక్షేమ, లౌకిక ఆదర్శ రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు శివాజీ అని పేర్కొన్నారు.
అలాంటి వీరుని జన్మదినం ఫిబ్రవరి 19 ని ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వలిగే సాంబారావు,జిల్లా నాయకులు కొల్లూరి కండేరావు,పేర్వాల లింగమూర్తి, సుకినే సుధాకర్ హింగే భాస్కర్. అంబీరు శ్రీనివాస్, సిందే చందర్ రావు వాడికారి నరహరి,తుమ్మనపల్లి రాజు,రామారావు,అముదాపురం రామారావు, వీరేశం ఆనందరావు, గోపాల్ రావు, వాడికారి రామారావు, హింగె భాస్కర్, వివిధ గ్రామాల కమిటీ సభ్యులు కుల బంధువులు పాల్గొన్నారు.