వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్లను ఎల్కతుర్తి మండల పరిధిలోని ఆరెపల్లె, సూరారం, చింతలపల్లి, దామెర గ్రామాలలోని ఆరె కులస్తులకు నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, జిల్లా నాయకులు కొల్లూరి కండేరావు, పేర్వాల లింగమూర్తి, సుకినే సుధాకర్, హింగే భాస్కర్, అంబీరు శ్రీనివాస్, ఆరె సంక్షేమ సంఘం ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి రాజు, హింగె రాజేశ్వర్ రావు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.