వేద న్యూస్, మరిపెడ:
టీఎస్‌యూటీఎఫ్ క్యాలెండర్‌ను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కు ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం తమవంతుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దు జరిగే విధంగా తాను కృషి చేస్తానని వెల్లడించారు.

అనంతరం వివిధ పాఠశాలలో క్యాలెండర్లు, డైరీ ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నందిగామ జనార్ధనాచారి, టీఎస్‌యూటీఎఫ్ మరిపెడ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సిహెచ్ ప్రభాకర్, గోవర్ధన్, కోశాధికారి శ్యామ్, మంగు, మంగీలాల్ ఎఫ్ డబ్ల్యూ కన్వీనర్ రామకృష్ణ జే.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.