వేద న్యూస్, ఆసిఫాబాద్:
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) శుక్రవారం నిర్వహించిన రివ్యూ సమావేశంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వ ప్రసాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి అజ్మీర శ్యామ్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ చార్జి రావి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా లోని రెండు నియోజకవర్గాల్లోని పలు సమస్యలను, జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి కూలంకషంగా మంత్రికి వారు వివరించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రిని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేస్తానని చెప్పారని, జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఉన్నసమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.