వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా ఆయన వాకింగ్ చేశారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వాకర్స్‌ను కలిశారు. వారితో కలిసి వాకింగ్ లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వాకర్స్ తో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిస్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వాకర్స్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, పులి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
