• ప్రధాని, రైల్వే మంత్రి, ఎంపీ బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం
  • వ్యాపార కేంద్రమైన జమ్మికుంటలో రైలు హాల్టింగ్ సంతోషకరం
  • బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట:

యశ్వంత్ పూర్ టు గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్ ప్రప్రథమంగా హాల్టింగ్ తో వయా జమ్మికుంటకు వచ్చిన రైలుకు బీజేపీ శ్రేణులు మంగళవారం ఘన స్వాగతం పలికాయి. జమ్మికుంటలో రైల్ ఆగడానికి చొరవ తీసుకున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కు, అలాగే ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్ చిత్రపటాలకు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార కేంద్రమైన జమ్మికుంటలో యశ్వంత్పూర్ -గోరక్ పూర్ రైలు ఆగడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ విజ్ఞప్తికి రైల్వే శాఖ స్పందించి..యశ్వంత్ పూర్ నుండి గోరక్ పూర్ వెళ్లే (12591/ 12592) ఎక్స్ ప్రెస్ రైలు ఇకపై జమ్మికుంటలో ఆగేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఎంపీ బండి సంజయ్ కుమార్ కలిసి వ్యాపార కేంద్రమైన జమ్మికుంటకు నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని..అయితే పలు రైళ్లు ఇటువైపుగా వెళుతున్నప్పటికీ హాల్ట్ లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన మంత్రి రైలును జమ్మికుంటలో నిలిపేసే(స్టాపేజ్) అంశంపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలో యశ్వంత్ పూర్- గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్ ను జమ్మికుంటలో (స్టాపేజ్) నిలపాలని రైల్వే శాఖ జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాడ గౌతంరెడ్డి, జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, తూర్పటి రాజు, దొంతుల రాజ్ కుమార్, రాజేష్ ఠాకూర్, కైలాస్ కోటి గణేష్, మోడమ్ రాజు,రాకేష్ ఠాకూర్, పాపయ్య,శనిగరపు రవి మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.